25, ఫిబ్రవరి 2010, గురువారం

ఈ మధ్యే జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్...

సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ................

సమయం: అప్పట్లో దూరదర్శన్ లో ఋతురాగాలు అయిపోయే సమయం.. ఆరుకి ఒకటి తక్కువ, నాలుగుకి ఒకటి ఎక్కువ...వెరసి సాయంత్రం అయిదు గంటలు.... .నేను రోజూలానే ఆఫీసుకి బయలుదేరాను (night shift). ఆఫీసుకి వెళ్లాలంటే మా రూమ్ నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చి ఆటో ఎక్కాలి. అక్కడి నుండి పది నిమిషాలు ప్రయాణం. నేను మాములుగానే మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అప్పుడే వచ్చిన ఆటో ఆపి perungudi అన్నాను. వాడు తమిళంలో ఏదో సొల్లాడు. ఎప్పటిలానే నాకు అది అర్థం కాకపోయినా, అదేదో సినిమాలో భారీ డవిలాగులా "భాష కన్నా భావం ముఖ్యం" అనుకుంటూ, వాడి సైగల్ని బట్టి ఎక్కమని చెప్పినట్లుగా అర్ధం చేసుకున్నాను. నాకొచ్చిన ఏకైక తమిళ పదం వాడి మీద ప్రయోగిస్తూ "ఎవళ" అన్నాను....అంటే తమిళంలో "ఎంత" అని(ట)!!! వాడు "అంజి రూపాయ" అన్నాడు. ఈ పదం నాకు చిన్నప్పటి నుంచే తెలుసు "అయిదు రూపాయలు" అని, తొమ్మిదో క్లాసు తెలుగు non-detail "బారిష్టర్ పార్వతీశం"లో చదువుకున్నా.... సరే అని చెప్పి ఎక్కాను..ఇక్కడ చెన్నై ఆటోల్లో విచిత్రంగా మనం మామూలుగా కూర్చునే సీటుకి just ముందుగా ఒక చెక్క ఉంటుంది (ఎదురుగా కాదు). అంటే సీట్లో కూర్చున్న వాళ్ల కాళ్లకి just ముందు అన్నమాట. నేను ఆటో మొత్తం ఖాళీగా ఉన్నా నా అలవాటు ప్రకారం చెక్క మీద అటు చివర (ఆటో ఎక్కే వైపు కాకుండా అవతలి వైపు) కూర్చున్నా...ఎందుకు అలా అని అడక్కండి, అదో అలవాటు, అంతే!!. ఆటో వాడు.... ఆటోలో వాడూ నేను తప్ప అన్య ప్రాణి ఎవరూ లేకపొవడంతో...as usual గా రోడ్డు మీద కనిపించిన ప్రతి వాడి దగ్గిర ఆపి వస్తారా వస్తారా అని ఆశగా అడుగుతూ పోతున్నాడు.....

ఇంతలో తరువాతి stop వచ్చింది. అక్కడ ఆటో ఆగగానే ఎవరో అమ్మాయిలు ఎక్కారు. నేను as usual గా ఏమీ పట్టించుకోకుండా నా దారిన నేను ఎటో చూస్తూ కూర్చున్నా.. ఇంతలో వాళ్ళ "సమ్"భాషణ మొదలయింది ఇలా.......

"హమ్మయ్యా.....వచ్చేశామే!!!!"

నాకు వాళ్ళు తెలుగు వాళ్ళని అర్ధం అయింది, అయినా కూడా వాళ్ల వైపు sudden గా తిరిగి చూస్తే బాగోదని, వాళ్ల వైపు తల తిప్పకుండా బయటకి చూస్తూ కూర్చున్నా.....

ఇంతలో ఒక అమ్మాయి ఏదో అనబోతుంటే, వేరొక అమ్మాయి sudden గా ఆపేసి
"హే ప్లీజ్!!! ఏం మాట్లాడొద్దు.......మొన్న ఇలాగే ఇది bus-stop లో ఎవడినో comment చేసింది. వాడికి తెలుగు రాకపొయినా దీని expressions ని బట్టి, అర్ధం చేసుకుని అదోలా చూశాడు మనల్ని".

ఇంతలో మరో అమ్మాయి "అవునే!!!మొన్న బస్ లో కూడా జనాల మీద comments చేసి మనలో మనం నవ్వుకుంటుంటే, అక్కడ వాళ్ళు అందరూ ఎదో పిచ్చి వాళ్లని చూసినట్లు చూశారు"..

నేను కొంచెం కూడా reaction చూపించకుండా, ఏదో చెన్నై రోడ్లన్నీ urgent గా check చెయ్యటానికి వచ్చిన R&B officer లా, extremely serious గా బయటికి చూస్తూ, వాళ్ళు మాట్లాడుకునేది అంత కన్నా serious గా వింటున్నా.......

అప్పుడు ఒక అమ్మాయి (బహుశా, మొదట మాట్లాదబోయిన అమ్మాయి అనుకుంటా!!) "ఏంటే అన్నిటికీ భయపడతారు!! అంటే ఏమవుతుంది! వీళ్లకి భాష రాదుగా.....expressions బట్టే కదా అర్ధం చేసుకునేది, ఒక పని చేద్దాం.....ఏం మాట్లాడినా face లో expression చూపించకుండా మాట్లాడాలి. నవ్వు వచ్చినా మనలో మనం మాట్లాడుకుంటూ నవ్వుకున్నట్లు ఉండాలి గానీ వాళ్ల వైపు చూసి నవ్వకూడదు, అర్ధం అయిందా"

వాళ్ల నవ్వు సంగతి ఏమో గానీ ఆ మాటలు వినగానే నాకు నవ్వు ఆగలేదు. ఇంకా ఏం మాట్లాడతారో విందామని నవ్వు control చేసుకోవటానికి ప్రయత్నించాను. జంధ్యాల/త్రివిక్రం సినిమా చుస్తూ ఒక్కసారి కూడా నవ్వకుండా కూర్చోవాలంటే ఎలా ఉంటుందో అంత కన్నా ఘోరంగా ఉంది నా పరిస్థితి. అయిన ఎలాగో కష్టపడి serious గా బయటకి చూస్తూనే కూర్చున్నా....

"అవునే!! ఆ పని చేద్దాం. కొంచెం కూడా ఎవరూ expression మార్చొద్దు...భలే ఉంటుంది!!"

"హే!!! ఇలా మధ్యలో english words use చేస్తూ ఉంటే, overall meaning అర్ధం అయిపోతుందే!!!"

"ఆ!! అదీ నిజమేనే!!! తెలిసిపోతుంది...ఎలా?"

"అయితే ఒక పని చేద్దాం!! మనం మాట్లాడే దానిలో ఒక్క english word కూడా ఉండకుండా మాట్లాడదాం........సో, ఒక్క english word కూడా రాకూడదు......సారీ సారీ!!! ఒక్క "ఆంగ్ల పదం" కూడా రాకూడదు....సరేనా!!!" అంటూ, తన joke-cum-idea కి తనే మురిసిపోతూ, మెల్లగా ముత్యాలు కురిపించింది... i mean ఇస్మైలు ఇచ్చింది......(నేను only audio నే వింటున్నాను లెండి)

మిగిలిన వాళ్లు కూడా తనకి కోరస్ గా "యా యా......ఆంగ్లంలోనే మాట్లాడదాం!!!!! ఆంగ్లంలోనే మాట్లాడదాం" అంటూ, శక్తి వంచన లేకుండా నవ్వుతున్నారు..

ఎటొచ్చీ నా పరిస్థితే, వాళ్ల మాటలకి నవ్వు ఆపుకోలేక పేలడానికి సిద్ధంగా ఉన్న బెలూన్ లా ఉంది. వీళ్ళు ఇంకొక్క మాట మాట్లాడితే పెద్దగా నవ్వేస్తాననగా......... అదృష్టవశాత్తూ నా stop వచ్చింది....

నేను హమ్మయ్యా అనుకుంటూ లేచి దిగటంకోసం నిలబడ్డాను. వాళ్లంతా ఇంకా almost నవ్వుతూనే ఉన్నారు.....అప్పుడు నేను నా పక్కన కూర్చున్న అమ్మయి వైపుకి తిరిగి serious గా అడిగాను

"కొంచెం side ఇస్తారా?????" అని.

అంతే!! అప్పటి వరకూ నాకు తెలుగు రాదనుకుని జోకులు వేసుకుంటున్న వాళ్లందరి నవ్వు ఒక్కసారే ఆగిపోయింది.
ఆ అమ్మయి ఠక్కున పక్కకి జరిగి నాకు space ఇచ్చింది.

నేను దిగి ఆటో వాడికి డబ్బులిస్తూ వాళ్ళ ముఖారవిందాల్లో expression ఎలా ఉందో ఒక్కసారి చూద్దామని, వాళ్ల వైపు ఓ లుక్కిచ్చాను.... హ హ....పాపం అందరూ shock లో ఉన్నట్లున్నారు. అందరూ ఒక్కసారి గా ఏదో గ్రహాంతరవాసిని చూసినట్లుగా stunn అయ్యి చూస్తున్నారు.

నేను ఏం మాట్లాడకుండా change తీస్కుని, ఆటో నుంచి వెనక్కి రెండు అడుగులు వేశాను....ఏదో పెద్ద shock నుంచి relieve అయ్యినట్లుగా వాళ్లు మళ్లీ నవ్వు start చేశారు ................నేను వెళ్లిపోయాననుకుని!!!!!!!!!!!!!!!!...

నేను వెనక్కి వచ్చి, serious గా
"అవును!!! ఆంగ్లంలో అస్సలు మాట్లాడొద్దు" అన్నాను.......అనేసి ఈసారి నేను నవ్వుకుంటూ వచ్చేశాను....

ఇంక వాళ్ల expression ఎలా ఉండి ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటా!!!

Shout