28, జనవరి 2010, గురువారం

ఇంట్లో వాళ్ళతో ఏమైనా పని చేయించుకోవాలా...అయితే వెంటనే ఇది ఫాలో అయిపోండి...

మైక్రోసాఫ్ట్ వెర్షన్ కిటికీలు రెండు వేలు

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు ఒకరోజు అకస్మతుగా ఒక ఆలోచన వచింది.తన సరికొత్త విండోస్ ని తెలంగాణా లాంగ్వేజ్ లో రుపొందిస్తే ఎలా ఉంటుందో అనేదే ఆలోచన. అసలు ముందు పాదాలకు అర్థలేంతో తెలుసుకుందామని కే సి ఆర్ గారిని కలిసాడు ఆయన ఎం చెప్పారంటే-వెర్షన్ కిటికీలు రెండువేలు.

Key words
search = దేవులాడు
save = బచాయించు
save as = గిట్ల బచయించు
find= ఎత్కు
Find Again = మల్ల ఎత్కు
Move= సర్కాయించు
insert= నడిమిట్ల పెట్టు
Space= జాగా
back Space= ఎన్క జాగా
run= ఉర్కు
print preview = చూసి అచ్చేయి
copy= గట్లాంటిదే
paste= అత్కేయి
exit= ఇగవోరి
compress= గుంజు
mouse= ఎలక
click= వొత్తు
doule click = మల్ల వొత్తు
double click with left mouse button = ఎలక చెవులు ఒకమలి ఎడం దిక్కు మల్ల మల్ల వొత్తు
access= దొరుకపట్టు
access denied= దొరక పట్టనియ
home= ఇంటికి వో
errors= నీ నోట్ల మన్ను వాడ

..గెట్లవుంది..జర...రిప్లయ్...చేయరాదుమల్ల.....!

నువ్వు గుర్తొచ్చావు

ఈ మధ్య ఏదో పాత బ్లాగులో చదివిన సరదా షాయరీ.........

ఇప్పుడే, మెరుపు మెరవగానే నువ్వు గుర్తొచ్చావు,
ఆపై, మేఘం ఉరమగానే నువ్వు గుర్తొచ్చావు,
వెనువెంటే వర్షం కురవగానే మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు;
నేను తడిసి ముద్దయ్యాను, అయినా నువ్వు గుర్తొచ్చావు...
ఎందుకు గుర్తుకు రావు మరి?
తీసుకున్న గొడుగు తిరిగి ఇస్తేగా నువ్వు...

(ఒక సరదా షాయరీకి తెలుగు అనువాదం)

15, జనవరి 2010, శుక్రవారం

తమాషా తెలుగు సామెత!!!

ఈ మధ్య ఏదో తెలుగు online magazine లో, ఒక కథ చదివానండీ…..అందులో ఒక తమాషా తెలుగు సామెత ఉంది. అది ఏంటంటే…

ఒక తుంటరి అబ్బాయి వాళ్ల భార్యతో సున్నం తీసుకురమ్మని ముద్దుగా(???) ఇలా అడిగాడట..ఏమన్నాడో అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి.

పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి
యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేగదే సుందరాంగి!!!

దీనికి అర్ధం ఏంటంటే-

పర్వత శ్రేష్ఠ పుత్రిక పార్వతి..పార్వతి పతి శివుడు. శివుని విరోధి మన్మధుడు.
మన్మధుని అన్న బ్రహ్మ. బ్రహ్మ పెండ్లాము సరస్వతి. సరస్వతి అత్త లక్ష్మి (బ్రహ్మ తండ్రి విష్ణువు కాబట్టి, విష్ణువు భార్య లక్ష్మి కాబట్టి), లక్ష్మిని గన్న తల్లి సముద్రుని భార్య.
వాళ్ల ముద్దుల పెద్ద బిడ్డ జ్యేష్ఠా దేవి- అంటే దరిద్ర దేవతా...కొంచెం సున్నం ఇవ్వచ్చు కదే!!!

అంటే అతను వాళ్ల భార్యతో ఏమన్నాడంటే- "ఒసే దరిద్రపు దానా.. కొంచెం సున్నం తెచ్చిపెట్టవే!!" అని..

ఆ గడసరి అమ్మాయి ఇలా అని సున్నం ఇచ్చిందట.

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో!!!!


ఈవిడ వాళ్ల ఆయనకి ఏమీ తీసిపొలేదండోయ్. ఈవిడ అన్న దానికి అర్ధం ఏంటంటే.

శతపత్రంబులు-కమలము..కమలము మిత్రుడు సూర్యుడు.
సూర్యుని సుతుడు కర్ణుడు. కర్ణుని జంపిన వాడు అర్జునుడు. అర్జునుని బావ కృష్ణుడు. కృష్ణుని సూనుడు (అంటే కొడుకు) ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుని మామ చంద్రుడు.
చంద్రుని సతతము దాల్చెడి వాడు శివుడు.
శివుని సుతుడు వినాయకుడు. అతని వాహనం ఎలుక. దాని వైరి పిల్లి. దాని వైరి కుక్కా....సున్నమిదిగో.

అంటే ఆ అమ్మాయి ఏమందంటే- "ఒరే కుక్కా...ఇదిగో సున్నం" అనీ!!!!!!

14, జనవరి 2010, గురువారం

చిన్ననాటి సంక్రాంతి

పెళ్ళిపుస్తకం లో గుమ్మడి అన్నట్లు, నేనూఊ….....చిన్నప్పుడు అందరిలాగే పండగలంటే చాలా ఇష్టపడేవాణ్ణి. కారణాలు మామూలే. ఎంచక్కా బడి ఎగ్గొట్టి ఇంట్లోనే ఉండొచ్చనీ, టి.వి. లో పండగ రోజు వచ్చే మంచి మంచి ప్రోగ్రాములు, కొత్త సినిమాలు చూడొచ్చనీ, ఇంకా సాయంత్రం మా నాన్న తో కలిసి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళొచ్చనీ!!! నాకు అన్ని పండగల్లోకీ బాగా ఇష్టమైనది దసరా. ఎందుకంటే 13 రోజులు సెలవలు ఇస్తారు మరి. అయిదు రోజులు ఇస్తారు కాబట్టి, సంక్రాంతి కూడా 'కుంచెం' ఇష్టమే. చిన్నప్పుడు సంక్రాంతి ప్రత్యేకతలు ఏంటీ అని అడిగితే (మీరు అడక్కపొయినా.. నేనే చెప్తాను), జనవరి నెలలో, పడుతుందా లేదా అన్నట్లుగా పొద్దున్నే పడే మంచు, ఊళ్ళో అందరూ వేసే రథం ముగ్గులు, అందులో అద్దే రంగులు, గొబ్బెమ్మలు, ఇంటికొచ్చే చుట్టాలు, హరిదాసులు, గంగిరెద్దు మేళం, ఆ దరిదాపుల్లోనే ఇచ్చే half-yearly exams resultsu.

సంక్రాంతి రోజు పొద్దున అయిదు గంటలకల్లా నిద్ర లేచే వాణ్ణి. అంతకు ముందే అమ్మా వాళ్ళు నిద్ర లేచి వంట పనిలో ఉండేవాళ్ళు. నేను లేచేసరికి గారెల పిండి రుబ్బే కార్యక్రమం లో ఉండే వాళ్ళు. అప్పుడే తెల తెలవారుతున్నట్లు, గోదావరి సినిమాలో heroine introduction sceneలో లా ఉండేది lighting. ఆ site నాకు చాలా చాలా ఇష్టం. నేను లేవగానే వినబడే మొదటి dialogue "ఏంటమ్మా అప్పుడే నిద్ర లేచావ్. ఇంకాసేపు పడుకోపోయావా??"..మా అమ్మ. అందరి ఇళ్ళల్లో పొద్దునే లేవమని తిడతారు(ట). కానీ మా ఇంట్లో మాత్రం నేను ఎన్నింటికి నిద్ర లేచినా ఇంకాసేపు పడుకోమనే అంటారు. అదొక అదృష్టం. తర్వాత మొహం కడుక్కోటం ఇత్యాది కార్యక్రమాలయ్యాక, చిన్నప్పటి సైన్సు పుస్తకం లో చదువుకున్న భాషలో చెప్పాలంటే- కాలకృత్యాలన్నీ పూర్తి అయ్యాక, ఇంక స్నానాల ప్రహసనం-మా ఇంట్లో చుట్టాలు అందరూ ఉన్నప్పుడు అది పెద్ద ప్రహసనమే మరి. పదిసార్లు చెప్పించుకుంటే గానీ తెమిలేవాళ్లు కాదు మా అక్కా&Co (అలంకారం అంటే అంత ఆసక్తి చూపించే అమ్మాయిలకి స్నానం అంటే అంత బద్దకం ఏంటో నాకు ఇప్పటికీ అర్ధం కాదు). నేను అలా కాదులేండి. కాంతు (నేనే) మంచి బాలుడు. అందరికన్నా ముందు నేనే వెళ్లేవాణ్ని. తయారవగానే గారెల మీదకి చట్నీ సహకారంతో దండయాత్ర. అతి ముఖ్యమైన ఆ కార్యక్రమం పూర్తవగానే, ఒకసారి బయటికి వెళ్లి రాత్రి మా అక్క వాళ్లు వేసిన ముగ్గు చూసేవాణ్ని. అదెంటో రాత్రి ముగ్గు వేసినంతసేపు పక్కనే ఉన్నా, పొద్దున్నే కొత్తగా కనిపించేది.

సంక్రాంతి ముందు రోజు రాత్రి మా అక్క, మా ఇంటి పక్క ఒక అమ్మాయి కూర్చుని ముగ్గు వేసే వాళ్లు. ఆ అమ్మాయి రోజూ మా ఇంటికి వచ్చేది. నాకు అప్పట్లో చాలా మంచి friend. ఆ.. ఆగండి ఆగండి. అక్కడే ఆగండి. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్ధం అయింది. ఎంతైనా మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఆ అమ్మాయి మా అక్క classmate. నాకు అక్క అవుతుంది (చుట్టరికంలో కూడా). మా అక్కా తనూ ముగ్గులు వేసినంత సేపూ నేను పక్కనే ఉండేవాణ్ని. అన్నట్లు మర్చిపోయా..మా ముగ్గుకి రంగులు నేనే తెచ్చేవాణ్ని. అయితే మా అమ్మ ఎన్ని రంగులు తెమ్మంటే అందులో సరిగ్గా రెండు తగ్గించి తెచ్చేవాణ్ని. మా అమ్మ ఏంటి తక్కువ తెచ్చావు..అని అడిగితే అర్జునుడికి భగవద్గీత చెబుతున్న శ్రీ కృష్నుడి లెవెల్లో ఫోజ్ పెట్టి- ఇంట్లో పసుపు, కుంకం ఉన్నాయి కదా. అవీ రంగులే కదా..ఎందుకు డబ్బులు దండగ.. అందుకే రెండు తక్కువ తెచ్చా అని ముగ్గోపదేశం చేసేవాణ్ని(పొదుపు!!???@^%$@$%@%#).

అన్నట్లు నేనూ ముగ్గు వెయ్యటానికి ప్రయత్నించానండోయ్ చాలా సార్లు. నాకు ముగ్గు వెయ్యటం, medicine చేసినవాడు జావా ప్రోగ్రాం రాసినంత కష్టంగా, తెలుగు మాష్టారు కాల్ సెంటర్లో జాబ్ చేసినంత అయోమయంగా ఉండేది. తీరా ఎలాగో కష్టపడి ఒక చిన్న ముగ్గు వేస్తే అది, software engineer ఇంటి ప్లాను గీసినంత అందంగా వచ్చేది. ఈ మధ్యకాలంలో అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదులేండి. మీ కోసం కష్టపడి నేను కంప్యూటర్లో వేసిన ఈ చిన్న ముగ్గు.



చిన్నప్పుడు సంక్రాంతి పండగకి ప్రధాన సందడి అంటే హరిదాసులు, గందిరెద్దు మేళమే. హరిదాసు రాగానే మా అమ్మ నన్నే వెళ్లి బియ్యం పోసి రమ్మనేది. ఎందుకంటే సర్వకాల సర్వావస్థలయందూ ఖాళీగా ఉండేది నేనే మరి. నాకు వాళ్లకి చాలా ఎక్కువ బియ్యం పోయాలని ఉండేది (ఎంతైనా జాలి గుండె కదా మలీ!!). కానీ నా చేతులేమూ చాలా చిన్నగా ఉండేవి. అందువల్ల దోసిట్లో కదిలితే కింద పడిపొతాయన్నంత నిండా పోసుకుని, ఇప్పుడు టి.వి.లో వస్తున్న ఏదో కాఫీ యాడ్ లో హీరోయిన్లా దోసిట్లో బియ్యన్నే చూస్తూ, అడుగులో అడుగు వేస్కుంటూ వెళ్లి హరిదాసు తల మీదున్న గిన్నెలో (గిన్నేనా???) పోసి వచ్చేవాణ్ని.

ఇప్పుడు అవన్నీ తల్చుకుంటే భలే నవ్వు వస్తుంది. కానీ దిగులుగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు జీ(వి)తం కోసం పెట్టే పరుగులో ఎవరికి వారే యమునా తీరే..అక్కకి పెళ్లైపోయింది. నేను ముందు చదువుకి, తర్వాత జాబుకి ఇంటినుంచి వచ్చేశాను. సో, పండగా లేదు, సందడీ లేదు. ముగ్గూ, అది వేసేవాళ్లూ ఎవరూ లేరు. ఇప్పుడు కాలక్రమేణా హరిదాసులు, గంగిరెద్దువాళ్లు కూడా రావటం మానేశారట. నాకు ఒకోసారి దేవుడి మీద (ఉంటే!!!) చాలా కోపం వస్తుంది. మనకి ఇష్టమైన అనుభవాల్ని మనకి మళ్లీ తిరిగి ఇవ్వలేనప్పుడు, వాటికి సంబంధించిన ఙ్నాపకాలని మాత్రం ఎందుకు మిగల్చాలి అని. కానీ వెంటనే మళ్లీ దేవుడు ఇలా చెప్తాడేమో అనిపిస్తుంది "పిచ్చివాడా!!! ఆ ఆనందాలు పూర్తిగా మళ్లీ తిరిగి రావు కాబట్టి, అవి నెమరు వేసుకుని అందులో కొంతైనా మళ్లీ పొందటానికి"..

13, జనవరి 2010, బుధవారం

Science and religion are not mutually exclusive


“Science and religion are not mutually exclusive. They convey the same information in two different perspectives”.

"శాస్త్రీయ విఙానము, మతం రెండూ పూర్తిగా ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు కాదు. ఒకే విషయాన్ని రెండు వేర్వేరు కోణాల్లో చెప్పేవి మాత్రమే."


మన మతాచారాల్లోనూ, సాంప్రదాయాల్లోనూ సైన్సుకి సంబంధించిన లాజిక్సు ఉండటం అందరికీ తెలిసిందే. ఉదాహరణకి, ఇప్పుడు సంక్రాంతికి మనం గొబ్బెమ్మల్లు తయారు చేయటానికి వాడే ఆవు పేడ anti-bacterial అనే విషయం అందరికీ తెలిసిందే. అలానే మనం వాడే పసుపు, మమిడి తోరణాలు ఇలా చాలా విషయాలకి scientific reasons ఉన్నాయి. నేను మొన్నీమధ్య స్వాతి వీక్లీలో ఒక ఆర్టికిల్ చదివాను. అందులో మన దశావతారలకి- Charles Darwin’s “Evolution theory” కి ఉన్న సంబంధాన్ని చాలా బాగా ప్రతిపాదించారు (కేవలం ప్రతిపాదన-suggestion మాత్రమే). ఆ ఆర్టికిల్ ఈ క్రింద ఫొటోలో ఉంది చూడండి.



నేను ఒక sociology textbook లో చదివాను- కొంత మంది ప్రతిపాదన ప్రకారం మనిషి మతాన్ని, తన అధీనంలో లేని supernatural powers (especially nature)కి అన్వయించటానికి, తన ఙ్నానానికి విశ్వానికి మధ్య ఉన్న అంతరాన్ని పూరించటనికి సృష్టించాడట (to form a bridge between human knowledge and the universe). నేను చదివిన ఇంకో కారణం ఏంటి అంటే- పూర్వకాలం లో ఋషులు, ఙ్నానులు వాళ్ళ శాస్త్ర విఙ్నానాన్ని మామూలు మనుషులకి, ముఖ్యంగా చదువుకోనివారికి కూడా అందజేయాలనే ఉద్దేశ్యం తో ఇలా మతాచారాల్లో, సాంప్రదాయాల్లో సంక్షిప్తం చేశారట. ఈ ఆర్టికిల్ చదువుతుంటే అది నిజమేననిపిస్తుంది. కదండీ.

11, జనవరి 2010, సోమవారం

పరిచయం

హాయ్. నేను చాలా రోజుల నుండి తెలుగు బ్లాగులు చదువుతున్నాను...ఎప్పటి నుంచో బ్లాగు మొదలు పెడదామని అనుకుంటూ, ఇవ్వాళ్టికి మొదలు పెట్టాను....మీ అందరూ నాకు తగిన సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఒకటి రెండు రోజుల్లో పొస్టులు మొదలు పెడతాను.

Shout