15, జనవరి 2010, శుక్రవారం

తమాషా తెలుగు సామెత!!!

ఈ మధ్య ఏదో తెలుగు online magazine లో, ఒక కథ చదివానండీ…..అందులో ఒక తమాషా తెలుగు సామెత ఉంది. అది ఏంటంటే…

ఒక తుంటరి అబ్బాయి వాళ్ల భార్యతో సున్నం తీసుకురమ్మని ముద్దుగా(???) ఇలా అడిగాడట..ఏమన్నాడో అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి.

పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి
యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేగదే సుందరాంగి!!!

దీనికి అర్ధం ఏంటంటే-

పర్వత శ్రేష్ఠ పుత్రిక పార్వతి..పార్వతి పతి శివుడు. శివుని విరోధి మన్మధుడు.
మన్మధుని అన్న బ్రహ్మ. బ్రహ్మ పెండ్లాము సరస్వతి. సరస్వతి అత్త లక్ష్మి (బ్రహ్మ తండ్రి విష్ణువు కాబట్టి, విష్ణువు భార్య లక్ష్మి కాబట్టి), లక్ష్మిని గన్న తల్లి సముద్రుని భార్య.
వాళ్ల ముద్దుల పెద్ద బిడ్డ జ్యేష్ఠా దేవి- అంటే దరిద్ర దేవతా...కొంచెం సున్నం ఇవ్వచ్చు కదే!!!

అంటే అతను వాళ్ల భార్యతో ఏమన్నాడంటే- "ఒసే దరిద్రపు దానా.. కొంచెం సున్నం తెచ్చిపెట్టవే!!" అని..

ఆ గడసరి అమ్మాయి ఇలా అని సున్నం ఇచ్చిందట.

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో!!!!


ఈవిడ వాళ్ల ఆయనకి ఏమీ తీసిపొలేదండోయ్. ఈవిడ అన్న దానికి అర్ధం ఏంటంటే.

శతపత్రంబులు-కమలము..కమలము మిత్రుడు సూర్యుడు.
సూర్యుని సుతుడు కర్ణుడు. కర్ణుని జంపిన వాడు అర్జునుడు. అర్జునుని బావ కృష్ణుడు. కృష్ణుని సూనుడు (అంటే కొడుకు) ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుని మామ చంద్రుడు.
చంద్రుని సతతము దాల్చెడి వాడు శివుడు.
శివుని సుతుడు వినాయకుడు. అతని వాహనం ఎలుక. దాని వైరి పిల్లి. దాని వైరి కుక్కా....సున్నమిదిగో.

అంటే ఆ అమ్మాయి ఏమందంటే- "ఒరే కుక్కా...ఇదిగో సున్నం" అనీ!!!!!!

3 comments:

మానస సంచర చెప్పారు...

ఇది పదవ తరగతి లో (ఎ పీ స్టేట్ సిలబస్) లో చాటువులు అనే పాఠం లో ఉన్నట్టు గుర్తు. దీనితో పాటు

అన్నాతి గూడ హరుడవే
అన్నాతి గూడనపుడు అసుర గురుడవే
అన్నా తిరుమల రాయా
కన్నొక్కటి మిగిలే గాని కౌరవ పతివే

భలే చమత్కారంగా ఉంటాయి.

అజ్ఞాత చెప్పారు...

haha bagundadndi..sarasa kaviki ekkada taggani gadusu bharyani anipinchindi..[:)]

శ్రీ..... చెప్పారు...

@ మానస సంచర గారు
చాటువులు ఉన్నట్లు గుర్తుంది గానీ...ఈ పద్యం ఉన్నట్లు గుర్తు లేదండీ???

@anonymous
thank you

Shout